
జనరల్

నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రాలపై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం తన 111వ చిత్రంతో బిజీగా ఉన్న బాలయ్య, ఆ తర్వాత దర్శకుడు కొరటాల శివతో కలిసి పని చేయనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ ఇప్పటికే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. కథకు తుది మెరుగులు దిద్దుతున్నారని, త్వరలోనే ముహూర్త కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. యువసుధ ఆర్ట్స్, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. నటీనటులు, సాంకేతిక బృందం ఎంపికపై చర్చలు కొనసాగుతున్నాయి. బాలయ్య వరుస విజయాలు, కొరటాల శివ ప్రత్యేక శైలి కలిసి ఈ చిత్రాన్ని భారీ అంచనాల మధ్య నిలిపాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!