

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ‘దాదా’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. బాలయ్యను పవర్‌ఫుల్ పాత్రలో చూపించేందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ యూత్ ఇంటరాక్షన్‌లో మాట్లాడిన థమన్, సినిమా ఫస్ట్ సింగిల్ సెప్టెంబర్ 24న వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే బాలకృష్ణ, కాజల్ అగర్వాల్‌పై చిత్రీకరించాల్సిన ఓ పాట కోసం చిత్ర బృందం న్యూజిలాండ్ వెళ్లనున్నట్లు థమన్ తెలిపారు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ‘దాదా’ డిసెంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!