
.jpg&w=3840&q=75)
వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణకు ఇటీవల విడుదలైన ‘అఖండ 2’ అనుకోని దెబ్బగా మారింది. బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ కావడంతో ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందని అందరూ భావించారు. కానీ సినిమా ఆశించిన ఫలితం రాకపోవడంతో మేకర్స్‌కు భారీ నష్టాలు ఎదురయ్యాయి. థియేటర్లలోనే 40 కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నాన్ థియేట్రికల్ పరంగానూ నష్టాలు తప్పలేదు. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. సినిమా 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధిస్తే 80 కోట్లు, లేకపోతే 35 కోట్లు మాత్రమే చెల్లిస్తామని ఒప్పందం జరిగింది. కానీ ‘అఖండ 2’ కేవలం సుమారు 100 కోట్ల గ్రాస్‌కే పరిమితమైంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ నుంచి మేకర్స్‌కు కేవలం 35 కోట్లే రావడం ఖాయమైంది.
ఈ ఫలితంతో బాలకృష్ణ మార్కెట్‌పై ట్రేడ్‌కు ఓ స్పష్టత వచ్చిందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. బాలయ్య సినిమా ఎంత పెద్ద హిట్ అయినా గ్రాస్ 150 కోట్లకు మించటం కష్టం, షేర్ 100 కోట్లకు రావడం అరుదు అనే అభిప్రాయం బలపడింది. ఇదే కారణంగా బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ప్లాన్ చేసిన కొత్త సినిమా ఆగిపోయిందని టాక్. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘వీర సింహా రెడ్డి’ పెద్ద కమర్షియల్ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు ప్లాన్ చేసిన సినిమా చారిత్రక నేపథ్యంతో, సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాల్సి ఉంది. అంత బడ్జెట్ పెట్టాలంటే పాన్ ఇండియా స్థాయిలో భారీ మార్కెట్ లేదా కనీసం తెలుగు వెర్షన్ నుంచే 300 కోట్ల గ్రాస్ వచ్చే స్థాయి అవసరం. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్ట్ రిస్క్ ఎక్కువగా ఉందని భావించిన నిర్మాతలు సినిమాను తాత్కాలికంగా ఆపేయాలని నిర్ణయించుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!