

పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఉత్సాహం ఎక్కువగా కనిపిస్తుంది. ఆయనను పెద్ద తెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఈ నెల 19 వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటాడో అని అందరిలో ఆసక్తి నెలకొంది.
ఇక కొత్త సినిమాల విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పిన కథ ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో మరో దర్శకుడు కూడా పవన్ కళ్యాణ్‌కు కథ చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ఆ దర్శకుడు ఎవరు అంటే, గతంలో పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ సినిమా చేసిన వేణు శ్రీరామ్. ఆయన మరోసారి పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
వేణు శ్రీరామ్ చెప్పిన కథ పవన్ కళ్యాణ్‌కు నచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. అందువల్ల త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. గత సంవత్సరం వేణు శ్రీరామ్ తీసిన ‘తమ్ముడు’ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తే మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కొంతమంది అభిమానులు మాత్రం మళ్లీ వేణు శ్రీరామ్‌తో సినిమా ఎందుకు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!