

తెలంగాణలో సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ రాత పరీక్ష నేడు నిర్వహించనున్నారు. మొత్తం 275 ఎస్ఐ పోస్టుల కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.6 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందుకోసం అధికారులు 335 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులు పరీక్షకు అవసరమైన హాల్‌టికెట్, గుర్తింపు కార్డుతో ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను ఉదయం 10 గంటల తర్వాత అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ప్రవేశం నిరాకరిస్తామని హెచ్చరించారు. అందువల్ల అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు, అభ్యర్థులు నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పరీక్ష రాయాలని కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!