
జనరల్

భారత్‌లో పాత మోడల్ వాహనాల కోసం ఈ10 పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచాలన్న డిమాండ్ నేపథ్యంలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఈ20 పెట్రోల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న సమయంలో, అధిక ఇథనాల్ కలిగిన ఈ20 వల్ల పాత వాహనాలపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని రెండో అతిపెద్ద రిటైల్ ఇంధన సంస్థ బీపీసీఎల్ కీలక ప్రకటన చేసింది.
ఈ20తో పాటు ఈ10 పెట్రోల్‌ను అందుబాటులో ఉంచే అంశంపై ప్రభుత్వం, చమురు సంస్థలు చర్చిస్తున్నాయని బీపీసీఎల్ ఛైర్మన్, ఎండీ సంజయ్ ఖన్నా తెలిపారు. అయితే, ఈ అంశంపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ20 స్థానంలో ఈ10 పెట్రోల్‌ను ప్రవేశపెట్టే ప్రతిపాదన ప్రస్తుతం లేదని ఆయన వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!