
జనరల్

అమరావతిలో మరో విడత భూసమీకరణకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. తాడికొండ మండలం మోతడక గ్రామంలో భూములను సమీకరించేందుకు ప్రక్రియ ప్రారంభించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన భూములను ఈ ప్రక్రియలో సమీకరించనున్నట్లు సీఆర్‌డీఏ పేర్కొంది. మోతడకలో మొత్తం 2,344.12 ఎకరాల భూమిని గుర్తించినట్లు తెలిపింది.
గుర్తించిన భూముల్లో 1,654.259 ఎకరాలు పట్టా భూములు కాగా, మిగిలిన భూమి ప్రభుత్వ భూమిగా సీఆర్‌డీఏ పేర్కొంది. అమరావతి ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేసే చర్యల్లో భాగంగానే ఈ భూసమీకరణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. నోటిఫికేషన్ ప్రకారం తదుపరి ప్రక్రియ కొనసాగనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!