

ప్రముఖ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన వైజాగ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆసుపత్రి బెడ్‌పై నుంచి వీడియో విడుదల చేసిన పండు మాస్టర్, ప్రమాదం జరిగిన విధానాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఓ ఈవెంట్ ముగించుకుని తిరిగి వస్తుండగా తనకు వాంతులు రావడంతో కారును రోడ్డు పక్కన ఆపారని, కొద్దిసేపటికే వెనుక నుంచి వచ్చిన వేగవంతమైన వాహనం వారి కారును ఢీకొట్టిందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను స్పృహ కోల్పోయానని, మళ్లీ ఆసుపత్రిలోనే కళ్లు తెరిచానని చెప్పారు.
ఈ ప్రమాదంలో పండు మాస్టర్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ముఖ్యంగా హిప్ జాయింట్ డిస్లోకేట్ కావడంతో పాటు మోకాళ్ల కింది భాగంలోని ఎముకలు, జాయింట్లు దెబ్బతిన్నాయని వైద్యులు వెల్లడించారు. అవసరమైన వైద్య పరీక్షల అనంతరం ఆయనకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని పండు మాస్టర్ తెలిపారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!