
క్రీడలు

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి అక్రమ బంగ్లాదేశీ వలసదారులను లక్ష్యంగా చేసుకుని “డిటెక్ట్, డిలీట్ & డిపోర్ట్” అనే కొత్త విధానాన్ని ప్రకటించారు. దీనిపై రాష్ట్రంలో పెద్ద రాజకీయ చర్చ ప్రారంభమైంది. ఈ విధానం ద్వారా అక్రమ వలసదారులను గుర్తించడం, ఓటర్ లిస్ట్ వంటి రికార్డుల నుంచి పేర్లు తొలగించడం,సరిహద్దు భద్రతా దళం సహకారంతో దేశం నుండి పంపించడం లక్ష్యంగా ఉంది.
అక్రమ ఇన్ఫిల్ట్రేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, పట్టుబడిన వారిని సరిహద్దు భద్రతా దళంకు అప్పగిస్తామని సీఎం తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం పరిధిలో ఉన్న అర్హత కలిగిన వారికి ఈ చర్యలు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతించగా, ప్రతిపక్షాలు అమలుపై, దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!