
సినిమాలు

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తమ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో మంగళవారం నాగ్‌పూర్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలు, హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతారా అనే ప్రశ్నకు స్పందించిన దీప్కే, ప్రతి ఉద్యమం ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ప్రజల హక్కుల కోసం పోరాడడం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం ఎన్నికల్లో పోటీ చేయకుండానే సాధ్యమని పేర్కొన్నారు. తమ సంస్థ ప్రజా ఉద్యమాలపైనే దృష్టి సారిస్తుందని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!