
ఓటీటీ

వివేకా హత్య కేసులో పదేపదే పిటిషన్లు దాఖలు చేయడంపై సీబీఐ ప్రత్యేక కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ల కారణంగా కేసు ట్రయల్ ఆలస్యం అవుతోందని పేర్కొంది. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ అదనపు దర్యాప్తు నిర్వహించి నివేదిక సమర్పించిన విషయాన్ని ప్రస్తావించింది.
క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు ఎప్పటికీ కొనసాగుతూ ఉండదని కోర్టు స్పష్టం చేసింది. మరోసారి దర్యాప్తునకు ఆదేశిస్తే విచారణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ కేసులో వేగవంతమైన విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించిన విషయాన్ని గుర్తు చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!