
జనరల్

తమిళనాడు ముఖ్యమంత్రిగా నటుడు విజయ్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మాజీ ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులకు ప్రత్యేక ఆహ్వానాలు పంపినట్లు సమాచారం.
విజయ్ ప్రమాణస్వీకారోత్సవాన్ని ప్రజలు వీక్షించేందుకు చెన్నై నగరంలోని 20 ప్రాంతాల్లో భారీ ప్రదర్శన తెరలను ఏర్పాటు చేశారు. విజయ్‌తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెల 13న ప్రభుత్వం శాసనసభలో బలపరీక్షను ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!