
సినిమాలు

నిషేధిత ఆస్తుల జాబితా నుంచి కొన్ని ప్లాట్లను తొలగించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పాటించకపోవడాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది.
అయితే, పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ జైలు శిక్షను నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది. ఈ శిక్ష, జరిమానా విధింపును సవాలు చేస్తూ కలెక్టర్ నారాయణరెడ్డి డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై విచారణ అనంతరం తదుపరి పరిణామాలు వెల్లడికానున్నాయి.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!