9, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జిల్లా ఆసుపత్రులను బలోపేతం చేస్తాం.. స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహ

Writer: Harika S 09:20 PM, 9 నవంబర్, 2026
జిల్లా ఆసుపత్రులను బలోపేతం చేస్తాం.. స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహ

రాష్ట్ర ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలను వారి సొంత జిల్లాల్లోనే అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీలు), ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులను మరింత బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఆసుపత్రుల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు, స్పెషలిస్ట్ వైద్యులు, అవసరమైన సిబ్బంది, డయాగ్నస్టిక్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. సోమవారం సచివాలయంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) పరిధిలోని సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి ఈ విషయాలు వెల్లడించారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) రూపొందించిన అధ్యయన నివేదికలోని ప్రతిపాదనలను సమావేశంలో పరిశీలించారు.

సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థ బలోపేతమైతే చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు కూడా రోగులు హైదరాబాద్ లేదా మెడికల్ కాలేజీ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని మంత్రి పేర్కొన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ పరిధిలోని ఆసుపత్రుల్లో ఇటీవల 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించినట్లు గుర్తుచేశారు. ఆసుపత్రుల వారీగా వైద్యులు, నర్సులు, టెక్నీషియన్ల అవసరాలు, వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ సదుపాయాలను సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. పడకల సామర్థ్యానికి అనుగుణంగా వైద్య సేవలను విస్తరించడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఐపీఎచ్‌ఎస్ ప్రమాణాల ప్రకారం ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే ప్రతి జిల్లాలో డీసీహెచ్‌ఎస్ కార్యాలయాలను ఏర్పాటు చేసి, ఆసుపత్రుల పనితీరు, వైద్య సేవల నాణ్యత, మౌలిక సదుపాయాల అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో జనగణన–2027 షెడ్యూల్ ఖరారు

తెలంగాణలో జనగణన–2027 షెడ్యూల్ ఖరారు

తెలంగాణలో బియ్యం ధరలకు గరిష్ట పరిమితులు.. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

రంగారెడ్డి కలెక్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష.. రూ.2 వేల జరిమానా విధించిన హైకోర్టు

హైదరాబాద్‌కు హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపిన కల్తీ పాలు.. పోచారంలో వ్యాపారి అరెస్ట్

కాశ్మీర్‌లోని చారిత్రక శారదా ఆలయంలో భక్తిశ్రద్ధలతో దీపావళి వేడుకలు

హైదరాబాద్ జీఎస్ఐలో మూడు కీలక వసతులను ప్రారంభించనున్న కిషన్‌రెడ్డి

ట్యాగ్లు
తెలంగాణ వైద్య సేవలుదామోదర రాజనర్సింహజిల్లా ఆసుపత్రులుస్పెషలిస్ట్ వైద్యులుసెకండరీ హెల్త్ కేర్ఐపీఎచ్‌ఎస్ ప్రమాణాలువైద్య మౌలిక సదుపాయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జిల్లా ఆసుపత్రులను బలోపేతం చేస్తాం.. స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహ
జనరల్

జిల్లా ఆసుపత్రులను బలోపేతం చేస్తాం.. స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహ

తెలంగాణలో జనగణన–2027 షెడ్యూల్ ఖరారు
జనరల్

తెలంగాణలో జనగణన–2027 షెడ్యూల్ ఖరారు

తెలంగాణలో బియ్యం ధరలకు గరిష్ట పరిమితులు.. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
జనరల్

తెలంగాణలో బియ్యం ధరలకు గరిష్ట పరిమితులు.. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

ఉత్తర అమెరికా బాక్సాఫీస్‌లో ‘రామాయణం’ను వెనక్కి నెట్టిన ‘గాడ్జిల్లా’
సినిమాలు

ఉత్తర అమెరికా బాక్సాఫీస్‌లో ‘రామాయణం’ను వెనక్కి నెట్టిన ‘గాడ్జిల్లా’

రంగారెడ్డి కలెక్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష.. రూ.2 వేల జరిమానా విధించిన హైకోర్టు
జనరల్

రంగారెడ్డి కలెక్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష.. రూ.2 వేల జరిమానా విధించిన హైకోర్టు

హైదరాబాద్‌కు హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపిన కల్తీ పాలు.. పోచారంలో వ్యాపారి అరెస్ట్
జనరల్

హైదరాబాద్‌కు హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపిన కల్తీ పాలు.. పోచారంలో వ్యాపారి అరెస్ట్

కాశ్మీర్‌లోని చారిత్రక శారదా ఆలయంలో భక్తిశ్రద్ధలతో దీపావళి వేడుకలు
జనరల్

కాశ్మీర్‌లోని చారిత్రక శారదా ఆలయంలో భక్తిశ్రద్ధలతో దీపావళి వేడుకలు

బిగ్‌బాస్ 10: పదో వారం నామినేషన్స్‌లో నీతూ ఆగ్రహం.. తనను తాను కొట్టుకున్న వైనం
షోస్

ఓటీటీలోకి ‘హ్యాపీ జర్నీ’ఎప్పుడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘హ్యాపీ జర్నీ’ఎప్పుడంటే?

హైదరాబాద్ జీఎస్ఐలో మూడు కీలక వసతులను ప్రారంభించనున్న కిషన్‌రెడ్డి
జనరల్

హైదరాబాద్ జీఎస్ఐలో మూడు కీలక వసతులను ప్రారంభించనున్న కిషన్‌రెడ్డి

ఏఐ సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉండాలి.. బ్యాంకులు, క్విక్ కామర్స్ సంస్థలకు సీపీ సజ్జనర్ హెచ్చరిక

వాతావరణ మార్పులపై అంతర్జాతీయ చర్చలు..
జనరల్

వాతావరణ మార్పులపై అంతర్జాతీయ చర్చలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!