

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మంగళవారం పాఠశాల విద్యార్థుల కోసం విస్తరించిన ‘పెరుంతలైవర్ కామరాజర్ ఉచిత అల్పాహార పథకం’ను ప్రారంభించారు. చెన్నైలోని తిరువాన్మియూర్ గాంధీ గ్రామం ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. గతంలో అమలైన అల్పాహార పథకాన్ని తాజాగా 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా వర్తించేలా విస్తరించారు. ఈ విస్తరణతో అదనంగా సుమారు 15.30 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 15,454 ప్రభుత్వ, ప్రభుత్వ సహాయ పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ విస్తరణ కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.217.63 కోట్ల అదనపు నిధులు కేటాయించడంతో, అల్పాహార పథకానికి మొత్తం కేటాయింపులు రూ.724 కోట్లకు చేరాయి. విద్యార్థులు ఉదయం ఆకలితో పాఠశాలకు రాకుండా చూడటం, వారికి పోషకాహారం అందించడం, ఆరోగ్యం, విద్యాభ్యాసంపై దృష్టి సారించేలా చేయడం పథకం ప్రధాన లక్ష్యాలని ప్రభుత్వం తెలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!