
సినిమాలు

తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ విజయం సాధించడంతో ఆయన అభిమానులు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. విజయం సందర్భంగా ఆలయం పరిసరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తిరుపత్తూర్ జిల్లా హారిగా నగర్‌కు చెందిన ప్రభాకర్, సుధాకర్ తదితరులు అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి 116 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మంచి పాలన అందించాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!