
రాజకీయాలు

సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు ప్రతి ప్రయాణికుడు రైలు ఎక్కే ముందు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే టికెట్ కలిగి ఉండాలని దక్షిణ రైల్వే చెన్నై డివిజన్ విజ్ఞప్తి చేసింది. ఇది కేవలం చట్టబద్ధమైన నిబంధన మాత్రమే కాకుండా సామాజిక బాధ్యత అని పేర్కొంది. అక్రమ ప్రయాణాలను అరికట్టేందుకు సబర్బన్, మెయిల్, ఎక్స్‌ప్రెస్ మరియు ప్రత్యేక రైళ్లలో నిరంతర టికెట్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
2025–26 ఆర్థిక సంవత్సరంలో టికెట్ తనిఖీ బృందాలు 12.24 లక్షల మంది టికెట్ లేని ప్రయాణికులను గుర్తించి రూ.65.16 కోట్ల జరిమానా వసూలు చేశాయి. ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవడానికి ‘రైల్ వన్’ యాప్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారాలను వినియోగించాలని సూచించారు. అలాగే ముఖ్యమైన స్టేషన్లలోని ఏటీవీఎం మెషీన్లు, బుకింగ్ కౌంటర్ల ద్వారా కూడా టికెట్లు పొందవచ్చని రైల్వే తెలిపింది.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!