

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ప్రచారంలోకి వచ్చింది. సాధారణ హీరో పరిచయ సన్నివేశంలా కాకుండా తారక్ ఎంట్రీని భారీ స్థాయిలో రూపొందించినట్లు సమాచారం. పాత్రలోని కొత్త కోణాన్ని పరిచయం చేస్తూనే, అక్కడి నుంచి కథను ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకెళ్లేలా సన్నివేశాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. అంటే ఎన్టీఆర్ ఎంట్రీనే కథకు కీలకమైన మలుపుగా ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాల్లో సాధారణంగా కనిపించే చీకటి ఛాయలతో కాకుండా, ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ భాగాన్ని పూర్తిగా రంగులమయంగా చూపించనున్నట్లు సమాచారం. దీంతో ఎన్టీఆర్ పాత్ర, కథనం, ఎంట్రీ సన్నివేశంపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న డ్రాగన్‌లో ఈ ప్రయోగం ఎలా ఉండబోతుందో చూడాలి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!