

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కీలక సైనిక కమాండ్ పేరులోని ‘ఇండో’ పదాన్ని తొలగిస్తూ అమెరికా మరోసారి ‘యూఎస్ పసిఫిక్ కమాండ్’ పేరును అమల్లోకి తీసుకువచ్చింది. జీ-7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనున్న వేళ ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. చారిత్రక వారసత్వాన్ని కొనసాగించడమే ఈ మార్పు ఉద్దేశమని అమెరికా రక్షణశాఖ వెల్లడించింది.
అయితే, కమాండ్ పరిధిని చూపిస్తూ విడుదల చేసిన మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్థాన్ భూభాగంగా చూపించారని ఆరోపణలు రావడంతో వివాదం మరింత ముదిరింది. 1947లో స్థాపించబడిన ఈ కమాండ్ ప్రాంతీయ భద్రత, మానవతా సహాయ కార్యక్రమాలు, కొరియా మరియు వియత్నాం యుద్ధాల్లో కీలక పాత్ర పోషించింది. 2018లో ట్రంప్ తొలి హయాంలో ‘ఇండో-పసిఫిక్ కమాండ్’గా పేరు మార్చగా, తాజాగా మళ్లీ పాత పేరుకు మారడం అమెరికా-భారత్ వ్యూహాత్మక సంబంధాలపై కొత్త చర్చకు దారితీసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!