23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమ్మే నా తొలి గురువు..యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగ వ్యాఖ్యలు

Writer: Pooja 10:39 AM, 23 నవంబర్, 2026
అమ్మే నా తొలి గురువు..యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగ వ్యాఖ్యలు

తల్లి ప్రేమకు ఏదీ సాటిరాదని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. సన్యాసం స్వీకరించిన తర్వాత తొలిసారి తన తల్లి ఎదుట నిలబడి భిక్ష అడిగిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. ఇటీవల కన్నుమూసిన తన తల్లి సావిత్రీ దేవి జ్ఞాపకాలను తలుచుకుంటూ ‘యోగి కీ పాటీ’ పేరుతో ఎక్స్ వేదికగా ఓ లేఖ రాశారు. అందులో తల్లి ప్రేమ, అనురాగం, తన జీవితంలో ఆమె పోషించిన పాత్ర గురించి వివరించారు. సన్యాసం స్వీకరించిన మూడేళ్ల తర్వాత ఉత్తరాఖండ్‌లోని తన స్వగ్రామానికి వెళ్లినట్లు యోగి తెలిపారు. కాషాయ వస్త్రాలు ధరించి ఇంటి ముందు నిలబడి భిక్ష అడిగానని చెప్పారు. తన గొంతు విని బయటకు వచ్చిన తల్లి.. కాషాయ వస్త్రాల్లో ఉన్న తనను చూసి తొలుత నమ్మలేకపోయిందని గుర్తుచేసుకున్నారు. అప్పుడు ‘అమ్మా.. నాకు భిక్ష పెట్టు’ అని అడిగానని తెలిపారు. సన్యాసం ఎందుకు తీసుకున్నావని, ఇంట్లో ఏమైనా కొరత ఉందా అని తల్లి ప్రశ్నించిందని చెప్పారు. అందుకు స్పందిస్తూ.. సన్యాసం తన ధర్మమని, యోగి ఆకలి భిక్షతోనే తీరుతుందని, ఇంట్లో ఉండేందుకు కాకుండా భిక్ష అడగడానికే వచ్చానని చెప్పినట్లు లేఖలో పేర్కొన్నారు. చివరకు తల్లి తన నిర్ణయాన్ని గౌరవించిందని గుర్తుచేసుకున్నారు.

తన లేఖలో యోగి ఆదిత్యనాథ్.. శ్రీరాముడు వనవాసానికి వెళ్లే ముందు తల్లి కౌసల్య ఆశీర్వాదం తీసుకున్న ఘట్టాన్ని, శ్రీకృష్ణుడు మథుర నుంచి గోకులానికి వెళ్లిన సందర్భాన్ని కూడా ప్రస్తావించారు. ‘అమ్మ అందరి స్థానాన్ని భర్తీ చేయగలదు. కానీ, అమ్మ స్థానాన్ని మాత్రం ఎవరూ భర్తీ చేయలేరు’ అంటూ తల్లి గొప్పతనాన్ని కొనియాడారు. తనకు అక్షర జ్ఞానంతో పాటు జీవిత విలువలను నేర్పిన తొలి గురువు తల్లేనని పేర్కొన్నారు. జీవితంలో కొన్ని రుణాలను ఎప్పటికీ తీర్చలేమని, అయితే మహిళలు, తల్లుల పట్ల మన బాధ్యతలను మాత్రం నెరవేర్చగలమని అన్నారు. అనాథలుగా, నిరాశ్రయులుగా మిగిలిన తల్లులకు అండగా నిలవాలని, కష్టాల్లో ఉన్న మహిళల బాధలను అర్థం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రీ దేవి ఈ నెల 20న కన్నుమూశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా హెచ్చరికలకు ఇరాన్‌ డబుల్‌ కౌంటర్‌

అమెరికా హెచ్చరికలకు ఇరాన్‌ డబుల్‌ కౌంటర్‌

గోవా ప్లాంట్‌ నీటి నాణ్యతపై బిస్లెరి కీలక ప్రకటన

గోవా ప్లాంట్‌ నీటి నాణ్యతపై బిస్లెరి కీలక ప్రకటన

హెచ్.ఎన్. భాస్కర్ కేసులో బాధితులకు అండగా చిన్మయి

హెచ్.ఎన్. భాస్కర్ కేసులో బాధితులకు అండగా చిన్మయి

పంబా నది కాలుష్యంపై అధికారుల కీలక నిర్ణయం

పంబా నది కాలుష్యంపై అధికారుల కీలక నిర్ణయం

కావ్య-అనిరుధ్ రిసెప్షన్‌లో స్టార్ హీరోల సందడి

కావ్య-అనిరుధ్ రిసెప్షన్‌లో స్టార్ హీరోల సందడి

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త జాబ్ పోర్టల్

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త జాబ్ పోర్టల్

ట్యాగ్లు
యోగి ఆదిత్యనాథ్సావిత్రీ దేవితల్లి ప్రేమభావోద్వేగ లేఖసన్యాసంఉత్తరప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పల్నాడులో ఉద్రిక్తత.. బాలకృష్ణ పీఏ సహా 66 మంది అరెస్ట్.. అసలేం జరిగిందంటే?
సినిమాలు

పల్నాడులో ఉద్రిక్తత.. బాలకృష్ణ పీఏ సహా 66 మంది అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

ఈ వారం ఓటీటీలోకి వస్తున్న ఆసక్తికరమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు
ఓటీటీ

ఈ వారం ఓటీటీలోకి వస్తున్న ఆసక్తికరమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

రామాయణంలో హనుమంతుడే అసలైన హీరో?
సినిమాలు

రామాయణంలో హనుమంతుడే అసలైన హీరో?

పుతిన్ అమెరికాకు మిత్రుడు కాదు..తేల్చిచెప్పిన నిఘా విభాగం
రాజకీయాలు

పుతిన్ అమెరికాకు మిత్రుడు కాదు..తేల్చిచెప్పిన నిఘా విభాగం

బీఆర్ఎస్ నేతల అరెస్టులపై జగదీశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
రాజకీయాలు

బీఆర్ఎస్ నేతల అరెస్టులపై జగదీశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

భోగి: జాతీయ అవార్డుపై శర్వానంద్ కన్ను?
సినిమాలు

భోగి: జాతీయ అవార్డుపై శర్వానంద్ కన్ను?

డ్రాగన్: రెండు కాదు.. ఒకటే?
గాసిప్స్

డ్రాగన్: రెండు కాదు.. ఒకటే?

అమ్మే నా తొలి గురువు..యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగ వ్యాఖ్యలు
జనరల్

అమ్మే నా తొలి గురువు..యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగ వ్యాఖ్యలు

మైసా వాయిదా?
గాసిప్స్

మైసా వాయిదా?

పుష్ప 2 రికార్డులను చేరిపేస్తున్న రామాయణ?
గాసిప్స్

పుష్ప 2 రికార్డులను చేరిపేస్తున్న రామాయణ?

భారత్ భారీ స్కోరుకు కివీస్ బ్యాటర్ల అడ్డుకట్ట
క్రీడలు

భారత్ భారీ స్కోరుకు కివీస్ బ్యాటర్ల అడ్డుకట్ట

విష్ణుతో ప్రభుదేవా భారీ ప్రాజెక్ట్?
గాసిప్స్

విష్ణుతో ప్రభుదేవా భారీ ప్రాజెక్ట్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!