

‘రామాయణం’ సినిమాకు సంబంధించి నిర్మాత నమిత్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఇతిహాస కథలో సన్నీ డియోల్ పోషిస్తున్న హనుమంతుడి పాత్రకు ఎంతో ప్రత్యేకత ఉందని ఆయన వెల్లడించారు. మొత్తం కథలో ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన పాత్ర హనుమంతుడే అవుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హాలీవుడ్ చిత్రాల్లో ఐరన్ మ్యాన్‌కు ఎలాంటి ప్రత్యేక గుర్తింపు ఉందో, ‘రామాయణం’లో హనుమంతుడికి కూడా అలాంటి ప్రాధాన్యత ఉంటుందని పోల్చారు. దీంతో ఈ పాత్రపై సినీ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
ముఖ్యంగా ‘రామాయణం’ రెండో భాగంలో హనుమంతుడి పాత్ర మరింత కీలకంగా ఉండబోతోందని నమిత్ మల్హోత్రా తెలిపారు. రెండో భాగంలో హనుమంతుడే కథను ముందుండి నడిపించే స్థాయిలో కనిపిస్తారని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో సన్నీ డియోల్ అభిమానులతో పాటు సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల్లోనూ అంచనాలు మరింత పెరిగాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!