
జనరల్

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (TSCPCR) చైర్పర్సన్ సీతాదయాకర్‌రెడ్డి స్పందించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నుంచి తెప్పించుకున్నట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేసినట్లు టీఎస్సీపీసీఆర్ వెల్లడించింది. బాలల హక్కులు, చట్టపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని కేసు దర్యాప్తును కమిషన్ నిశితంగా పర్యవేక్షించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!