

డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌ను బ్యాంకింగ్ వ్యవస్థలో రిస్క్ ఫ్యాక్టర్‌గా పరిగణించాలని కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయం ముఖ్యంగా H-1B వీసా హోల్డర్లు, ఓపీటీ (OPT)పై ఉన్న విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు, రుణ సంస్థలు లోన్లు మంజూరు చేసే ముందు వీసా స్థితిని పరిశీలించాల్సి ఉండొచ్చని తెలుస్తోంది. తాత్కాలిక వీసాలపై అమెరికాలో నివసిస్తున్న విదేశీయుల బ్యాంక్ ఖాతాలు, ఆర్థిక లావాదేవీలపై కూడా నిఘా పెరగనున్నట్లు సమాచారం.
వలసదారుల హక్కుల సంఘాలు, టెక్ ఉద్యోగుల సంస్థలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. చట్టబద్ధంగా అమెరికాలో పనిచేస్తున్న నైపుణ్య వలసదారులను లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని అవి విమర్శించాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలకంగా సేవలందిస్తున్న వేలాది మంది విదేశీ ఉద్యోగులపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఇమ్మిగ్రేషన్ స్థితిని ఆర్థిక రిస్క్‌గా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ న్యాయపరంగా పోరాడతామని వలసదారుల సంఘాలు ప్రకటించాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!