
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదివారం నుంచి ఈ నెల 11 వరకు దక్షిణ కొరియాలో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొరియా వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో సమావేశమై, ఏపీలో పెట్టుబడులు, ద్వైపాక్షిక సహకార అవకాశాలపై చర్చించనున్నారు.
సియోల్‌లో నిర్వహించే ఇండియా డయాస్పోరా సమావేశంలో లోకేశ్ ప్రసంగించనున్నారు. అలాగే దక్షిణ కొరియాలో నివసిస్తున్న భారతీయులు, తెలుగువారితో ఆత్మీయంగా భేటీ కానున్నారు. పరిశ్రమల ప్రతినిధులతో కూడా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణపై చర్చలు జరపనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!