
జనరల్

ఖరీఫ్–2026, రబీ 2026–27 సీజన్లకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీజన్ ప్రారంభమైన 40 రోజుల తర్వాత పంటల బీమా అమలుకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. రైతులకు పంట నష్టాల నుంచి రక్షణ కల్పించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.
వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని కూడా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఫసల్ బీమా పథకంలో పాల్గొనని బీమా కంపెనీల స్థానంలో కొత్త కంపెనీలకు అవకాశం కల్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!