
క్రీడలు

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, తారక్ కొత్త మేకోవర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. పాత్ర కోసం ఆయన బరువు తగ్గడంతో అభిమానులు తొలుత కొంత ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే ఇటీవల విడుదలైన తాజా ఫొటోలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. స్లిమ్‌గా కనిపించినప్పటికీ తారక్ ఎంతో ఫ్రెష్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తూ అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. పాత్ర కోసం ఈ మార్పు చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రశాంత్ నీల్ హీరోలను పవర్‌ఫుల్‌గా చూపించే శైలిపై ఉన్న నమ్మకంతో ‘డ్రాగన్’పై అంచనాలు మరింత పెరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!