

ఇరాన్‌పై సైనిక దాడుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై చేపట్టాలని భావించిన దాడుల ప్రణాళికలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవడం, ఇరాన్ అణు ముప్పును తగ్గించడం వంటి అంశాలతో కూడిన ప్రతిపాదిత ఒప్పందంపై చర్చలకు మరింత సమయం అవసరమని ఇరాన్, పశ్చిమాసియా దేశాలు కోరినట్లు ట్రంప్ తెలిపారు. ఒప్పందం త్వరగా ఖరారైతేనే దాడుల విరామం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
టెహ్రాన్‌పై భారీ సైనిక చర్యకు అమెరికా సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రపంచ ప్రయోజనాలు, ఇరాన్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దాడులను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. యుద్ధాన్ని ముగించి ఒప్పందం చేసుకునేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా అంగీకరించినట్లు ఆయన తెలిపారు. మరోవైపు, అమెరికా దాడులకు పాల్పడితే తీవ్ర ప్రతీకారం ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఖతార్, పాకిస్థాన్ వంటి దేశాలు అమెరికా, ఇరాన్ ప్రతినిధులతో దౌత్య చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!