

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్‌కుమార్ సింగ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సెప్టెంబర్ 28, 2026న జరిగిన కొలీజియం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ అపరేష్‌కుమార్ సింగ్‌తో పాటు గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ పేర్లను కూడా సుప్రీంకోర్టుకు సిఫార్సు చేశారు.
జస్టిస్ అపరేష్‌కుమార్ సింగ్ 1965 జూలై 7న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ పూర్తి చేసిన అనంతరం ఎల్ఎల్బీ చదివారు. 1990లో న్యాయవాదిగా నమోదు చేసుకుని తొలుత పాట్నా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. అనంతరం జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగారు. 2012 జనవరిలో జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2014 జనవరిలో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేసి, 2025 జూలైలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!