

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. టీటీడీ అధికారిక గణాంకాల ప్రకారం సెప్టెంబర్ 27న ఏకంగా 83,578 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. రద్దీ కారణంగా టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, ఇతర ప్రాంతాల్లో టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సాధారణ భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు అక్టోబర్ 1, 5 తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ తేదీలకు సంబంధించి సిఫార్సు లేఖల స్వీకరణపై కూడా ఆంక్షలు విధించింది. మరోవైపు తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన చారిత్రక పుష్కరిణిని రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో పునరుద్ధరించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!