

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వెలుగులోకి వచ్చిన ఫొటోలో కనిపించిన నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులూ భద్రతా బలగాల ఆపరేషన్లలో హతమైనట్లు సమాచారం. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని బద్గామ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది మహ్మద్ ఆసిఫ్ అలియాస్ హషిమ్ మూసా మృతి చెందాడు. పహల్గామ్ దాడితో సంబంధం ఉన్న కీలక అనుమానితుల్లో మూసా కూడా ఉన్నట్లు భద్రతా సంస్థలు పేర్కొన్నాయి.
మంగళవారం రాత్రి యూస్మార్గ్‌లోని కొరాగ్ ప్రాంతంలో నిర్దిష్ట నిఘా సమాచారంతో భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఎదురుకాల్పుల్లో మూసా హతమైనట్లు అధికారులు తెలిపారు. అనంతరం పాలమైదాన్ ప్రాంతంలో చేపట్టిన గాలింపు చర్యల్లో అతడి మృతదేహంతో పాటు ఆయుధాలు, ఇతర యుద్ధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పహల్గామ్ దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులూ భద్రతా బలగాల చర్యల్లో హతమైనట్లు అధికారులు వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!