

మలయాళ వార్తా ఛానల్ బిగ్ టీవీకి చెందిన సీనియర్ కోఆర్డినేటింగ్ ఎడిటర్, జర్నలిస్ట్ అపర్ణ కురుప్పై కేరళం పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఇస్లామిక్ పండితుడు కాంతపురం ఎ.పి. అబూబకర్ ముస్లియార్ మహిళల స్వేచ్ఛపై చేసిన వ్యాఖ్యలను టీవీ చర్చా కార్యక్రమంలో అపర్ణ ప్రశ్నించి విమర్శించారు. మహిళలు ఇళ్లకే పరిమితం కావాలని, వారు బహిరంగ ప్రదేశాల్లో తిరగడం వల్ల సమాజంలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ వ్యాఖ్యలపై అపర్ణ తన కార్యక్రమంలో తీవ్రంగా స్పందించారు.
చర్చా కార్యక్రమం ప్రసారమైన తర్వాత వివాదం మరింత ముదిరినట్టు తెలుస్తోంది. మతపరమైన ఒత్తిళ్ల నేపథ్యంలో బిగ్ టీవీ ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించడంతో పాటు అపర్ణతో క్షమాపణలు చెప్పించినట్టు సమాచారం. అనంతరం తనకు సోషల్ మీడియా ద్వారా వరుసగా హత్యా బెదిరింపులు వస్తున్నాయని ఆమె కేరళం పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఆమెపైనే మతపరమైన భావాలను దెబ్బతీశారనే ఆరోపణలతో కేరళం పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై భావప్రకటన స్వేచ్ఛ, మహిళల హక్కులు, జర్నలిస్టుల భద్రత వంటి అంశాలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. మహిళా హక్కులు, సమానత్వం, భావప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడే కార్యకర్తల మౌనంపై కూడా కొందరు నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!