

మదనపల్లెలో నేడు రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన జరగనుంది. ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొననున్నారు. రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేయనున్నారు. ఇందులో ప్రభుత్వం నుంచి రూ.40,352 కోట్ల పెట్టుబడులు, ప్రైవేట్ రంగం నుంచి రూ.60 వేల కోట్ల పెట్టుబడులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ హార్టికల్చర్ హబ్‌ను 10 జిల్లాల్లోని 201 క్లస్టర్ల పరిధిలో అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 303 మండలాలు, 5,869 గ్రామాల్లో ఉద్యాన పంటల సాగు, మౌలిక వసతులు, ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజీ, మార్కెటింగ్, ఎగుమతుల సదుపాయాలను అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ఉన్న ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచి రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యాల్లో ఒకటిగా ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!