
జనరల్

దేశ రాజధాని ఢిల్లీలోని జామా మసీదు పోలీస్ స్టేషన్‌లో కత్తి దాడి ఘటన కలకలం రేపింది. కుటుంబ వివాదానికి సంబంధించిన విచారణ నిమిత్తం నబీల్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. ఈ క్రమంలో అతడు ఒక్కసారిగా ఐదుగురు పోలీసులపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడిలో గాయపడిన పోలీసులకు చికిత్స అందించినట్లు తెలుస్తోంది.
దాడి అనంతరం నబీల్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఓ ద్విచక్ర వాహనాన్ని దొంగిలించినట్లు సమాచారం. అతడిని వెంబడించిన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నబీల్ గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, గాయపడిన పోలీసుల ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!