

హిమాలయ ప్రాంతంలో విష వాయువుల స్థాయులు పెరుగుతున్నట్లు తాజా శాస్త్రీయ అధ్యయనం వెల్లడించింది. క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రమాదకర కాలుష్య కారకం అయిన బెంజీన్ గాలిలో ఆందోళనకర స్థాయికి చేరినట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రపంచంలోని అత్యంత స్వచ్ఛమైన ప్రకృతి ప్రాంతాల్లో ఒకటిగా భావించే హిమాలయాల్లో ఈ పరిస్థితి తలెత్తడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. బెంజీన్ వంటి కాలుష్య కారకాల ప్రభావం దీర్ఘకాలంలో క్యాన్సర్, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విపరీతంగా పెరుగుతున్న పర్యాటకం, భారీ నిర్మాణ పనులు, రవాణా కార్యకలాపాలు మరియు ఇతర మానవ జోక్యాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని అధ్యయనం సూచిస్తోంది. హిమాలయాల సున్నితమైన పర్యావరణ వ్యవస్థపై ఈ ప్రభావం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ చర్యలను కఠినతరం చేయడం, స్థిరమైన పర్యాటక విధానాలను అమలు చేయడం ద్వారా మాత్రమే ఈ సమస్యను నియంత్రించవచ్చని వారు సూచిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!