

కొవ్వూరు నియోజకవర్గంలోని చాగల్లు మండల పరిధిలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. చాగల్లు–కలవలపల్లి గ్రామాల మధ్య పంట పొలాలు, గ్రామ శివారు ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి కదలికలను గుర్తించి సురక్షితంగా బంధించేందుకు పుణెకు చెందిన ప్రత్యేక రెస్క్యూ టీమ్‌తో పాటు ఆర్ఆర్ఆర్ బృందాన్ని రంగంలోకి దించారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఆయా బృందాలు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి.
పెద్దపులి సంచార నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు పొలాల్లో పనిచేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. ఎవరూ ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని, పులి కనిపిస్తే దాని దగ్గరకు వెళ్లడం లేదా వెంబడించడం చేయవద్దని హెచ్చరించారు. చాగల్లు మండలంలోని గ్రామాల ప్రజలను తహసీల్దార్ మెరికమ్మ చాటింపు ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. పాడిపశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రెవెన్యూ అధికారులు సూచించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!