
జనరల్

ఢిల్లీలో నిరసనకారులపై జరిగిన పోలీసుల చర్యపై స్పందించిన అభిజీత్ దీప్కే తల్లి భావోద్వేగానికి గురయ్యారు. నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదని, ఆ ఘటన తమ కుటుంబానికి తీవ్ర వేదన కలిగించిందని కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
తన కుమారుడు అమెరికాలో మంచి వేతనంతో కూడిన ఉద్యోగాన్ని వదిలి దేశ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో భారత్‌కు తిరిగి వచ్చాడని ఆమె తెలిపారు. అమెరికాలోనే ఉంటే మంచి జీవితం గడిపేవాడని తాను ఎన్నిసార్లు చెప్పినా, ప్రజల కోసం పనిచేయాలనే సంకల్పంతో స్వదేశానికి వచ్చాడని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఢిల్లీలో నిరసనలపై పోలీసుల చర్యలు మరియు విద్యార్థుల ఉద్యమంపై కొనసాగుతున్న చర్చల మధ్య ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!