

గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 152 పేపర్ లీక్ ఘటనలు వెలుగుచూశాయని, అయినప్పటికీ ఒక్క కేసులోనూ దోషులను గుర్తించి శిక్షించలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నీట్ పరీక్షలలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత పాలనలో దేశ విద్యావ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని పేర్కొంటూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
విద్య పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారిందని రాహుల్ గాంధీ అన్నారు. నీట్ అభ్యర్థులు కోచింగ్ కోసం ఏటా సుమారు రూ.1.32 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఇది కేంద్ర విద్యా బడ్జెట్‌కు దాదాపు సమానమని పేర్కొన్నారు. విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్‌పై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!