

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ద్రోణి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మహారాష్ట్ర వరకు విస్తరించి ఉందని ఆయన వివరించారు.
దీని ప్రభావంతో శుక్రవారం అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉరుములతో వర్షం పడే సమయంలో రైతులు, పశుపోషకులు చెట్ల కింద నిలబడకుండా సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు.
అదే సమయంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 43 నుండి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరి, పోలవరం, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు కొనసాగుతాయని కూడా హెచ్చరించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!