

ఆన్‌లైన్ గేమ్ ఫ్రీ ఫైర్ మోజులో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో హైదరాబాద్‌లో కలకలం రేగింది. 8, 9 తరగతులు చదువుతున్న ఈ బాలికలు గేమ్ ఆడుతున్న సమయంలో బిహార్‌కు చెందిన గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయం పెంచుకున్నారు. గేమ్స్ ఆడుతున్నందుకు తల్లి మందలిస్తోందని చెప్పగా, బిహార్‌కు వస్తే ఎలాంటి ఆంక్షలు లేకుండా గేమ్స్ ఆడుకోవచ్చని వారు ప్రలోభపెట్టినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బాలికలు జూన్ 22న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బిహార్ వెళ్లే రైలెక్కారు.
బాలికలు కనిపించకపోవడంతో తల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు గేమ్ ఐడీ, ఐపీ అడ్రస్, సోషల్ మీడియా ఆధారాలను విశ్లేషించి బాలికలు ప్రయాణిస్తున్న రైలును గుర్తించారు. వెంటనే రైల్వే పోలీసులు, ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు పోలీసులకు సమాచారం అందించడంతో వారు బాలికలను సురక్షితంగా రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పిల్లలు అపరిచితులతో ఆన్‌లైన్‌లో మాట్లాడకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!