
జనరల్

భారత నౌకాదళం మరింత బలోపేతం కానుంది. శత్రు రహస్య ఎత్తుగడలను ఎదుర్కొనే ఆధునిక దేశీయ టెక్నాలజీతో తయారైన మూడు వార్‌షిప్‌లను ఈ నెల 21న కోల్‌కతాలో ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఈస్టర్న్ నేవల్ కమాండ్ సన్నాహాలు చేస్తోంది.
ఐఎన్ఎస్ అగ్రయ్ అనేది యాంటీ సబ్‌మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్‌గా రూపొందించబడింది. ఐఎన్ఎస్ సంశోధక్ హైడ్రోగ్రాఫిక్ సర్వే పనులకు ఉపయోగపడుతుంది. ఐఎన్ఎస్ దుణగిరి ప్రాజెక్ట్ 17ఏ కింద రూపొందించిన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్‌గా బ్రహ్మోస్ క్షిపణులతో సముద్ర యుద్ధ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇవి భారత నేవల్ పవర్‌ను మరింత బలోపేతం చేయనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!