
జనరల్

పంజాగుట్టలో రూ.15 లక్షల నగదు ఉన్న బ్యాగ్ చోరీ కావడం కలకలం రేపింది. కలెక్షన్ ఏజెంట్ అఫ్షన్కు చెందిన నగదు బ్యాగ్ స్టాంప్స్ షాప్ సమీపంలో కుర్చీపై ఉంచిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి పరారయ్యారు.
సమీప ప్రాంతాల సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. విచారణలో అఫ్షన్ స్నేహితుడే ఈ చోరీకి మాస్టర్ ప్లాన్ రూపొందించినట్టు పోలీసులు నిర్ధారించారు. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుని పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!