
జనరల్

ఆంధ్రప్రదేశ్ సచివాలయం సమీపంలో డ్రోన్ తరహా పరికరం కనిపించడం కలకలం రేపింది. శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.
ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగి ఇది డ్రోనా, లేక శిక్షణ విమానమా అనే కోణంలో విచారణ ప్రారంభించారు. భద్రతా సంస్థలతో కలిసి పోలీసులు ఈ ఘటనపై సమగ్రంగా ఆరా తీస్తున్నారు. సచివాలయం వంటి సున్నిత ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!