

మైనర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో నమోదైన పోక్సో కేసులో బండి భగీరథ్ వ్యవహారం తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నెల 9న కేసు నమోదైనప్పటి నుంచి భగీరథ్ అజ్ఞాతంలోకి వెళ్లగా, ఇప్పటికే పోలీసులు రెండుసార్లు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కోరారు. అలాగే కరీంనగర్‌లో నివసిస్తున్న అతడి మేనమామ వంశీకృష్ణకు కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు నోటీసులు అందజేశారు.
మరోవైపు ముందస్తు లేదా మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై అర్ధరాత్రి వరకు విచారణ జరగగా, ఎలాంటి బెయిల్ మంజూరు చేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో భగీరథ్ పోలీసులకు లొంగిపోవడం తప్పదన్న పరిస్థితి ఏర్పడింది. కొంపల్లిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, భగీరథ్ త్వరలో లొంగిపోవచ్చన్న ప్రచారం కొనసాగుతోంది. అయితే అధికారిక ధృవీకరణ మాత్రం ఇంకా వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!