

స్కూల్ ఎడ్యుకేషన్ విభాగానికి చెందిన అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించేలా నిబంధన తీసుకురావాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రులు, రాజకీయ నాయకులు స్వయంగా అర్థం చేసుకునేందుకు తమ పిల్లలను కనీసం ఒక్కరోజైనా గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని సూచించారు. గ్రామీణ విద్యార్థులకు సరైన రవాణా సదుపాయాలు కల్పించడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. గత వారం ‘పాఠశాలలను మెరుగుపరచండి’ అనే నినాదంతో దీప్కే ఉద్యమాన్ని ప్రారంభించారు.
తన స్వస్థలం హింగోలి జిల్లాలోని లింబాలాలో మంగళవారం మీడియాతో మాట్లాడిన దీప్కే.. ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడితే హింగోలి లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు అభ్యంతరం లేదని చెప్పారు. అంతకుముందు ఓ గ్రామంలోని జడ్పీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మద్యం సేవించి తరగతి గదిలో నిద్రిస్తున్నట్లు చూపించే వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు ఆ ఉపాధ్యాయుడిని మంగళవారం సస్పెండ్ చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!