

ట్రేడింగ్ పరిమాణంలో ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్‌గా ఉన్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ), ప్రతిపాదిత ఐపీఓకు సుమారు రూ.5.26 లక్షల కోట్ల (55 బిలియన్ డాలర్లు) విలువను పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. సామర్థ్యం కలిగిన పెట్టుబడిదారులతో నిర్వహించిన సమావేశాల్లో ఒక్కో షేర్‌కు రూ.2,000-2,100 ధరను సూచించినట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. ఐపీఓ ప్రచారంలో భాగంగా ఎన్‌ఎస్‌ఈ అంతర్జాతీయ స్థాయిలో రోడ్‌షోలు నిర్వహిస్తోంది. పశ్చిమాసియాలో మరో దశ ప్రచారం నిర్వహించాల్సి ఉంది.
ప్రస్తుత వాటాదార్లు ఎన్‌ఎస్‌ఈలో సుమారు 6 శాతం వాటాకు సమానమైన 14.89 కోట్ల వరకు షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా విక్రయించాలని యోచిస్తున్నారు. ఈ వాటా విక్రయం ద్వారా సుమారు 55 బిలియన్ డాలర్లు (రూ.31,500 కోట్లు) సమీకరించాలన్నది ప్రణాళికగా తెలుస్తోంది. 2024లో హ్యుందాయ్ మోటార్ ఇండియా నిర్వహించిన రూ.27,870 కోట్ల ఐపీఓ ప్రస్తుతం దేశంలోనే అతిపెద్దదిగా ఉంది. ప్రతిపాదిత ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ విజయవంతమైతే, దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఈ ఇష్యూ కోసం కోటక్ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, మోర్గాన్ స్టాన్లీ, హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్స్, సిటీ గ్రూప్‌తో పాటు మొత్తం 20 బ్యాంకులను ఎన్‌ఎస్‌ఈ నియమించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!