

కుటుంబ బాధ్యతల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే పేద మహిళల జీవితాల్లో ఎన్నో కష్టాలు దాగి ఉంటాయి. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలానికి చెందిన తురుమణి వీర వెంకమ్మ అనే 52 ఏళ్ల మహిళ భర్త మరణం తర్వాత తన ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు కోసం కొన్ని సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లారు. కుమార్తెలను తన తల్లి సంరక్షణలో ఉంచి ఉపాధి కోసం అల్ ఖర్జ్ పట్టణంలో పనిచేశారు. అయితే అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో యజమాని వద్ద నుంచి వెళ్లిపోయి అనధికారికంగా జీవనం కొనసాగించారు.
ఇటీవల ఆమె తల్లి మరణించడంతో స్వదేశానికి తిరిగి రావాలని వెంకమ్మ నిర్ణయించుకున్నారు. కానీ పాస్‌పోర్టు, వీసా గడువు ముగియడంతో పాటు విమాన టికెట్ కొనుగోలు చేసే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న సామాజిక సేవకులు, సాటా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేశన్ సహాయంతో ఒక దాత విమాన టికెట్ ఏర్పాటు చేశారు. కుటుంబ బాధ్యతలు, అప్పుల కారణంగా అనేక మంది మహిళలు గల్ఫ్ దేశాల్లో ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని మల్లేశన్ ఆవేదన వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!