
జనరల్

విశాఖపట్నంలోని HPCL రిఫైనరీలో నూతనంగా ఏర్పాటు చేసిన కూలింగ్ టవర్ సమీపంలోని ప్లాంట్ వద్ద మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మంటలతో పాటు పొగ కనిపించడంతో మల్కాపురం, శ్రీహరిపురం, సింధియా ప్రాంతాల నివాసితులు ఏం జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై స్పందించిన మల్కాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఈ. నరసింహారావు మంటలు ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయని తెలిపారు. HPCLలోని ఫైర్ సిబ్బంది తమ అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారని, బయటి నుంచి ఫైర్ ఇంజిన్లను తీసుకురావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదని చెబుతూ, ప్రజలు భయాందోళనలకు గురికావద్దని ఆయన భరోసా ఇచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!