

ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులకు భారత ఆర్మీ ఇంజినీర్ల సేవలను వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముగ్గురు ఆర్మీ ఇంజినీరింగ్ అధికారులను డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి పంపేందుకు ఆర్మీ ప్రధాన కార్యాలయం పేర్లను పంపింది. లెఫ్టినెంట్ కల్నల్ సత్యదేవ్ సింగ్, లెఫ్టినెంట్ కల్నల్ రంజిత్ ఏ. మీనన్, లెఫ్టినెంట్ కల్నల్ హెచ్.వీ. భల్లా పేర్లను రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకు పంపినట్లు సమాచారం.
ముగ్గురిలో ఒకరు ఎస్ఎల్బీసీ టన్నెల్‌లోని రెండు తవ్వకాల ప్రాంతాల్లో పనులను పర్యవేక్షించనుండగా, మరో ఇద్దరిని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు కేటాయించనున్నారు. ఆర్మీ ఇంజినీర్ల సాంకేతిక నైపుణ్యంతో పనుల్లో నాణ్యత నియంత్రణ, క్షేత్రస్థాయి సమన్వయం, భద్రతా ప్రమాణాలు మరింత బలోపేతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!