

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మక ఆర్యదాన్ ముహమ్మద్-2026 అవార్డుకు ఎంపికయ్యారు. కేరళకు చెందిన దివంగత నాయకుడు, మాజీ మంత్రి ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని అందిస్తోంది.
తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు, నాయకత్వాన్ని గుర్తించి రేవంత్ రెడ్డిని ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ వర్కింగ్ ఛైర్మన్, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌకత్ తెలిపారు. ఎంపీ బెన్నీ బెహనన్, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి ఏ.పీ. అనిల్‌కుమార్, ప్రముఖ మేధావి కల్పెట్ట నారాయణన్ జ్యూరీగా వ్యవహరించారు. ప్రజాస్వామ్య విలువల పట్ల రేవంత్ రెడ్డికి ఉన్న నిబద్ధతను కూడా జ్యూరీ ప్రస్తావించినట్లు తెలిపారు.
ఆర్యదాన్ ముహమ్మద్ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీ శుక్రవారం కేరళలోని నిలంబూర్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకలో ఎంపీ కే.సీ. వేణుగోపాల్ స్మారక ఉపన్యాసం చేయనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!