
సినిమాలు

బెంగళూరు నుంచి విజయవాడకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX2875లో బుధవారం సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్‌కు సిద్ధమైన అనంతరం సమస్య గుర్తించడంతో విమానం తిరిగి బేకు చేరుకుంది. ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, ఇతర ప్రయాణికులు ఉన్నారు.
విజయవాడలోని వెలగపూడి సచివాలయంలో జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు మంత్రి మండిపల్లి బెంగళూరు నుంచి బయలుదేరారు. సాంకేతిక సమస్య కారణంగా విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. లోపాన్ని సరిచేసిన తర్వాత విమానం ఎప్పుడు బయలుదేరుతుందనే దానిపై అధికారిక సమాచారం కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!